హైదరాబాద్‌లో క్రోడా గ్లోబల్‌ టెక్నికల్‌ సెంటర్‌

హైదరాబాద్‌:స్మార్ట్‌ సైన్స్‌ను ఉపయోగించి అధిక పనితీరును చూపించే ఉత్పత్తులు, జీవితాలను మెరుగుపరిచే పరిష్కారాలను రూపొందించే క్రోడా ఇంటర్నేషనల్‌ పబ్లిక్‌ లిమిటెడ్‌ హైదరాబాద్‌లో గ్లోబల్‌ టెక్నికల్‌ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. నగరంలోని జినోమ్‌ వ్యాలీలో ఈ సెంటర్‌ను ప్రారంభించనున్నట్లు తెలిపింది. లైఫ్‌ సైన్సెస్‌ కోసం అధిక పనితీరు కలిగిన ఔషధ పదార్థాలు, సాంకేతికతలను అభివృద్థి చేసేందుకు క్రోడా నిరంతర నిబద్దతలో ఈ పెట్టుబడి పెడుతున్నట్లు క్రోడా లైఫ్‌ సైన్సెస్‌ అధ్యక్షుడు డానియెల్‌ పియర్‌జెంటిలి పేర్కొన్నారు. చిన్న మాలిక్యూల్‌, వినియోగదారుల ఆరోగ్య ఉత్పత్తుల కోసం కంపెనీకి గొప్ప ఆవిష్కరణల చరిత్రతో పాటు, క్రోడా దాని అభివృద్థి, బయోలాజిక్‌ అప్లికేషన్‌ల కోసం పదార్థాల మద్దతు ఇచ్చే అంశాలలో గుర్తింపు పొందింది.