పోషణ మాసం కార్యక్రమంలో భాగంగా మండలంలో పోషన్ అభియాన్ కార్యక్రమం కొనసాగుతోంది. సోమవారం కొండంపేట,కేశారం పల్లి గ్రామాల్లో అంగన్ వాడి టీచర్లు ఇప్ప సరితా,అక్కల స్వర్ణలత, ఎన్ కల్యాణి ఆధ్వర్యంలో అంగన్ వాడి కేంద్రాల్లో నిర్వహించారు. ఈ సందర్భంగా టీచర్లు మాట్లాడారు. తల్లులకు పిల్లల పోషణ, గర్భిణీ స్త్రీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. ప్రతి గర్భిణీ స్త్రీ అంగన్వాడి కేంద్రంలో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలన్నారు. పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఉండాలంటే పౌష్టికాహారం తీసుకోవాలని గర్భిణులకు సూచించారు. గర్భవతులకు ఆకుకూరలు కూరగాయలు తింటే రక్తహీనతనం నివారించవచ్చున్నారు.ఈ సందర్భంగా పోషణ మాసం ప్రాముఖ్యతపై వివరించారు. ఆరు నెలలు నిండిన పిల్లలకు అన్నప్రాసన, మూడు సంవత్సరాలు నిండిన పిల్లలకు అక్షరాభ్యాసం నిర్వహించారు.అనంతరం పోషణ మాంసంపై ర్యాలీ నిర్వహించి ప్రతిజ్ఞ చేయించారు.ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది, ఆయాలు,గర్భిణీలు,చిన్న పిల్లల తల్లులు,ప్రజలు పాల్గొన్నారు.