నవతెలంగాణ – మోపాల్
మోపాల్ మండలంలోని మంచిప్ప చెరువులో గత కొద్ది రోజుల క్రితం భారీగా కురిసిన వర్షానికి పూడిక ఏర్పడి నీరు వృధాగా పోతుంది గత సంవత్సరం నుండి నీరు వృధాగా పోతున్న అధికారులకు ,గ్రామస్తులు ఎన్నిసార్లు విన్నవించిన వాళ్ళు పట్టించుకోకుండా ఈ ఏడాది వర్షాకాలము మొదలవ్వకముందే అధికారులు ఎలాంటి కాంక్రీట్ వాడకుండా కేవలం మట్టితో నామమాత్రంగా ఆ పూడికను పూడ్చి వెళ్లిపోయారు .భారీ వర్షానికి ఈ ఏడాది ఆ పూడికకు ఇంకా పగుళ్లు ఏర్పడి భారీ ఎత్తున నీరు బయటకు వృధాగా పోతుంది. వర్షాకాలం ఇంకా నెల రోజులు ఉన్న సగానికి పైగా చెరువులోని నీటిమట్టం తగ్గిపోవడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు ఇది ఇలాగే కొనసాగితే వచ్చే పంటపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుందని వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు . ఇప్పటికైనా అధికారులు స్పందించి ఆ పూడికని తాత్కాలికంగా అయినా మరమ్మత్తులు చేసి నీటి వృధాను తగ్గించాలని గ్రామస్తులు కోరుతున్నారు ఇప్పటికైనా ఇరిగేషన్ అధికారులు తమ మొద్దు నిద్రను వీడి గ్రామాల్లో పర్యటించాలని అలా పర్యటించినప్పుడే చెరువుల సమస్యలు గ్రామాల్లో నీటి సమస్యలు తెలుస్తాయని ఆఫీసులో కూర్చుని ఉంటే సమస్యలు పరిష్కారాలూ కావని గ్రామస్తులు పదే పదే కోరుతున్నారు.