నిరుపేదలకు పట్టాలు ఇవ్వాలని వినతి..

Request to give degrees to the poor.నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
భువనగిరి మండలం హన్మాపురం గ్రామ సర్వేనెంబర్ 28 ప్రభుత్వ భూములు గత మూడు సంవత్సరాల నుండి నిరుపేద కుటుంబాలకు పట్టాలు ఇవ్వాలని కోరుతూ సీపీఐ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఏశాల అశోక్ మాట్లాడుతూ.. కలెక్టర్  ఇంటి స్థలాలు ఇల్లు ఇప్పించడం కోసం రాష్ట్ర ప్రభుత్వానికి సిఫారసు చేస్తానని హామీ ఇచ్చినట్లు తెలిపారు. ప్రభుత్వం ప్రత్యేకంగా దీనికి బడ్జెట్ కేటాయించి 300 మంది నిరుపేదలకు కొత్త ఇండ్లు నిర్మించి ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ ఆందోళన కార్యక్రమంలో నాగపురి యాదగిరి, అబ్బులు, శ్యామల, కృష్ణవేణి, శ్రీలత, బాలమణి రేష్మ, రజియా బేగం, వరలక్ష్మి కేతమ్మ లు పాల్గొన్నారు.