ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఐఎఫ్ డబ్ల్యూజే కౌన్సిల్ సమావేశం ఈనెల 28 నుండి 30 వరకు ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని మధురలో జరిగే సమావేశాలను విజయవంతం చేయాలని టి యు డబ్ల్యూ జే ఎఫ్ జిల్లా అధ్యక్షులు టీవీ రాజు గౌడ్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వర్కింగ్ జర్నలిస్టులు ఈ మూడు రోజులపాటు జరిగే ఈ సమావేశంలో అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశాలకు వచ్చే జర్నలిస్టులకు ఈ మూడు రోజులపాటు అకామినేషన్స్ అందించేందుకు సమావేశ నిర్వాహకులు ఏర్పాటు చేస్తున్నారని, వర్కింగ్ జర్నలిస్టులు విధిగా హాజరయ్యేందుకు ముందుకు రావాలని ఈ సందర్భంగా తెలిపారు. కార్యక్రమంలో టియుడబ్ల్యూజేఎఫ్ జిల్లా కార్యదర్శి పొలుమారి గోపాల్, కమిటీ సభ్యులు ఇసంపల్లి రమేష్ గజ్జల సుమన్ తదితరులు పాల్గొన్నారు.