– “స్వచ్ఛతా హి సేవ” కార్యక్రమంలో భాగంగా విద్యార్థులతో ర్యాలీ
నవతెలంగాణ – తాడ్వాయి
పర్యావరణం పరిరక్షణ అందరి బాధ్యత అని మనం వెల్ఫేర్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షులు చౌలం శ్రీనివాస్ అన్నారు. మంగళవారం స్వచ్ఛతా హి సేవ కార్యక్రమంలో భాగంగా మండల కేంద్రంలో విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. గ్రామపంచాయతీ సిబ్బంది బస్టాండ్ లోని చెత్తను తొలగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్లాస్టిక్ వాడకం ఎక్కువై వాతావరణం కాలుష్యత సమతుల్యానికి తేడా ఏర్పడి అనారోగ్య, భూతాపం వరదలు సునామీ సుడిగాలు అడవుల దహనం తదితర అంశాలు చోటు చేసుకుంటున్నాయని అన్నారు. ప్లాస్టిక్ ని పూర్తిగా నిషేధించాలన్నారు. దీనికి విద్యార్థుల కృషి ఎంతో అవసరం అన్నారు. విద్యార్థులకు అవగాహన నిర్వహించారు. పచ్చని మొక్కలు నాటడం వల్ల ప్రాణవాయువు మన ఆరోగ్యం, జంతు జీవాలకు ప్రాణకోటికి ప్రాణవాయువు లభిస్తుందన్నారు. అందుకే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలి అన్నారు. ప్లాస్టిక్ నిషేధించాలన్నారు. ఈ కార్యక్రమంలో తాడ్వాయి గ్రామపంచాయతీ కార్యదర్శి రేగ రాజశేఖర్, పంచాయతీ కార్యదర్శి, విద్యార్థినిలు తదితరులు పాల్గొన్నారు.