కస్తూర్బా లో డిస్క్ బెంచీల కొరత 

Shortage of disc benches in Kasturba– నేలపై కూర్చొని చదువు కొనసాగిస్తున్న విద్యార్థినిలు 

నవతెలంగాణ – కమ్మర్ పల్లి
మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో విద్యార్థులను డెస్క్ బెంచీల కొరత వేధిస్తుంది. విద్యాలయంలో చదివే ఆరు, ఏడు తరగతుల విద్యార్థినిలు తరగతి గదిలో నేలపైన కూర్చొనే తమ చదువులను కొనసాగిస్తున్నారు. కస్తూర్బా బాలికల విద్యాలయంలో  6 నుంచి 10వ తరగతి వరకు  207 మంది విద్యార్థినిలు ఉన్నట్లు ప్రత్యేక అధికారిని గంగామణి తెలిపారు. విద్యాలయంలో కేవలం 150 డిస్క్ బెంచ్ లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. వాటిని ఎనిమిది, తొమ్మిది, పది తరగతుల  విద్యార్థినులకు కేటాయించారు.దీంతో ఆరు, ఏడవ తరగతి విద్యార్థినిలు  నేలపైన కూర్చొనే తమ చదువును కొనసాగించాల్సిన పరిస్థితి నెలకొంది. విద్యాలయంలో అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉన్న డిస్క్ బెంచీల కొరత మాత్రమే విద్యార్థినిలకు  ఇబ్బందికరంగా మారింది. ప్రభుత్వం గానీ, స్వచ్చంద సంస్థలు గాని స్పందించి విద్యార్థులకు డిస్క్ బెంచీలను సమకూర్చాలని ఈ సందర్భంగా కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం ప్రత్యేక అధికారిని గంగామణి విజ్ఞప్తి చేశారు.