వస్త్ర షాపింగ్ మాల్ కు నోటీసులు ఇచ్చిన అధికారులు

Officials issued notices to Vastra Shopping Mallనవతెలంగాణ – కంఠేశ్వర్

నిజామాబాద్ నగరంలోని రాష్ట్రపతి రోడ్డులో నూతనంగా నిర్మిస్తున్న వస్త్ర షాపింగ్ మాల్ కు నిజామాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ అధికారులు  నోటిస్ లు జారీ చేశారు. టౌన్ ప్లానింగ్ అధికారి సత్యనారాయణ అధ్వర్యంలో సిబ్బంది మంగళవారం ఉదయం షాపింగ్ మాల్ నిర్మాణం కొసం చేసిన దరఖాస్తులు వేరు నిర్మాణం జరుగుతున్నది వేరుగా ఉందని ఈ మేరకు నోటిస్ లుమ ఇచ్చినట్లు తెలిసింది. ఐతే మంగళవారం జిల్లా కేంద్రంలో త్వరలో ప్రారంభంగా కాబోతున్న ప్రముఖ వస్త్ర షాపింగ్ మాల్ కు నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ అధికారులు ఉదయం వెల్లగా కోందరు కార్పోరేటర్లు వారిని అడ్డుకోన్నారు అని ప్రచారం జరుగుతుంది, అందులో భాగంగా మున్సిపల్ అధికారులను సిబ్బందిని షాపింగ్ మాల్ లోకి వారిని లోనికి అనుమతించలేదు అని సమాచారం. దానితో ఈ విషయంను ఉన్నతాధికారులకు సమాచారం అందించిన వారు నోటిస్ లు ఇచ్చి వెనుదిరిగారు. వస్త్ర షాపింగ్ మాల్ నిర్మాణం గత ఎడాధికాలంగా జరుగుతుంటే ఎందుకు బల్దియా అధికారులు అప్పుడు నోటిస్ లు ఇవ్వకపోవడంపై చర్చ జరుగుతుంది. షాపింగ్ మాల్ నిర్మాణం పూర్తి చేసుకోని మరి కొన్ని గంటలలో ప్రారంభోత్సవంకు పనులు జరుగుతుంటే టిఎస్ బిపాస్ అధికారులు ఎందుకు అడ్డుకోలేదని చర్చ మొదలైంది. టౌన్ ప్లానింగ్ అధికారులకు దరఖాస్తులో ఇచ్చిన ప్లాన్ కు విరుద్ధంగా సెట్ బ్యాక్ లేకుండా ఐదంతస్థుల నిర్మాణం, పైర్ సెప్టి మేజర్ మెంట్ లను ఉల్లంఘించడం పట్ల అధికారులు నిర్లక్ష వైఖరిపై అనుమానాలు ఉన్నాయి.