సుఖ ప్రసవం చేసిన రెంజల్ 108 ఈఎంటి

Renjal 108 EMT who gave birth successfullyనవతెలంగాణ – రెంజల్
 రెంజల్ మండలం కల్యాపూర్ గ్రామానికి చెందిన మాధవి రెండవ కాన్పు పురిటి నొప్పులు రావడంతో వారి కుటుంబ సభ్యులు 108 సమాచారం అందించారు. 108 వాహనం వచ్చేసరికి పురిటి నొప్పులు అధికం కావడంతో వారి ఇంటి లోనే ఈఎంటి సంజీవ్ గౌడ్ సుఖప్రసావాన్ని చేశారు. పండంటి మగ బిడ్డకు జన్మని ఉన్న మాధవి బిడ్డ ఆరోగ్యంగా ఉండడంతో వారిని ప్రథమ చికిత్స కొరకు స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం తరలించారు. 108 సిబ్బంది సకాలంలో వచ్చి తల్లి బిడ్డలను క్షేమంగా ప్రసారం జరిగిన వారిని కుటుంబీకులు అభినందించారు. పైలట్ నయూముద్దీన్ ఉన్నారు.