అర్ధ శతాబ్ద సభను విజయవంతం చేయండి

Make the half-century meeting a successనవతెలంగాణ – డిచ్ పల్లి
అక్టోబర్ 24 న ఉస్మానియా యూనివర్సిటీ ఠాగూర్ ఆడిటోరియంలో జరిగే పి.డి.ఎస్.యూ అర్ధ శతాబ్ద సభను  విజయవంతం చేయాలని పి.డి ఎస్.యూ నాయకులు రవీందర్ యూనివర్సిటీ విద్యార్థులకు పిలుపు నిచ్చారు. పి.డి.ఎస్.యూ అర్థ శతాబ్ద సభ పోస్టర్స్ ను తెలంగాణ యూనివర్సిటీ బాయ్స్ హాస్టల్  ముందు బుధవారంఆవిష్కరించారు. ఈ సందర్భంగా  పి.డి ఎస్.యూ నాయకులు మాట్లాడుతూ పి.డి.ఎస్.యూ గత 50 ఏండ్ల కాలంలో విద్య రంగ సమస్యలపైన, శాస్త్రీయ విద్యా సాధనకై, సమ సమాజ స్థాపనకై ,నూతన ప్రజాస్వామిక  విప్లవం కోసం, విద్య ప్రైవేటీకరణ కార్పొరేటికరణ కు  వ్యతిరేకంగా పి.డి.ఎస్.యూ విద్యార్థి సంఘం పోరాడుతూ వస్తుందని , విద్యార్థి ఉద్యమంలో జార్జ్ రెడ్డి, జంపాల చంద్రశేఖర్ ప్రసాద్ ,రంగవల్లి  మరియు ఎందరో విద్యార్థి రత్నాలు  బిగిపిడికిలి జెండా కోసం తమ ప్రాణాలను తృణ ప్రాయంగా అర్పించరని అన్నారు. వారి పోరాట వారసత్వాన్ని కొనసాగించాలని , అక్టోబర్ 24 న జరిగే పి.డి.ఎస్.యూ అర్ధ శతాబ్దోత్సవ సభకు యూనివర్సిటీ విద్యార్థులు హాజరై విజయవంతం చేయాలని అన్నారు.ఈ కార్యక్రమంలో నాయకులు రాకేష్, పాండు,నిరాజ్,రాము,సాయి,మహేష్,వికాస్, శివ తదితరులు పాల్గొన్నారు.