పాల ఉత్పత్తిదారుల మండల అధ్యక్షునిగా మెట్టు సురేందర్ ఏకగ్రీవంగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు సొల్లేటి నారాయణరెడ్డి తెలిపారు. బుధవారం మండల కేంద్రంలోని విజయ డైరీ వారి బల్క్ మిల్క్ చిల్డ్ యూనిట్ (బీ ఎం సీ యు) ధర్మసాగర్ పాల ఉత్పత్తిదారుల వివిధ గ్రామాల అధ్యక్షుల సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.ధర్మసాగర్ విజయ పాల ఉత్పత్తిదారుల సహకార సంఘం ఐక్యతతో ముందుకు సాగాలన్నారు.భావితరాలకు పౌష్టికాహారాన్ని అందించేందుకు నాణ్యత లోపాలు లేకుండా పాల ఉత్పత్తిని చేసేందుకు కృషి చేయాలన్నారు. నేటి బాలలు రేపటి పౌరులుగా ఎదిగేందుకు మనం చేస్తున్న అభివృద్ధికి,సరియైన న్యాయం చేసే విధంగా నాణ్యత ప్రమాణాలు పాటించాలన్నారు. అనంతరం వివిధ గ్రామాల పాల ఉత్పత్తిదారుల సమక్షంలో నూతన అధ్యక్ష ఉపాధ్యక్షులను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందని తెలిపారు. నూతన అధ్యక్షునిగా మెట్టు సురేందర్ ను,ఉపాధ్యక్షుడిగా బొల్లం రాజును ఎన్నుకోవడం జరిగిందన్నారు.