గ్రామ మంచినీటి సహాయకుల శిక్షణతో త్వరితగతిన సమస్యల పరిష్కారం

గ్రామ మంచినీటి సహాయకుల శిక్షణతో త్వరితగతిన సమస్యల పరిష్కారం– గ్రామ మంచినీటి సహాయకుల 4 రోజుల శిక్షణ తరగతుల
– ప్రారంభోత్సవంలో మిషన్ భగీరథ ఎస్సీ ఎన్ రఘువీర్

నవ తెలంగాణ – పటాన్ చెరు
గ్రామ మంచినీటి సహాయకులకు గ్రామాలలో పరితగతిన సమస్యలు పరిష్కారం అవుతాయని మిషన్ భగీరథ ఎస్సీ ఎన్ రఘువీర్ పేర్కొన్నారు. బుధవారం పట్టణంలోని మండల ప్రజా పరిషత్ సమావేశ మందిరంలో జరిగిన గ్రామ మంచినీటి సహాయకుల నాలుగు రోజుల శిక్షణ కార్యక్రమం జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభమైంది. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో మిషన్ భగీరథ ఎస్సి రఘువీర్ మాట్లాడుతూ గ్రామాలలో మంచినీటి సమస్యలు తలెత్తకుండా చిన్న చిన్న సమస్యలు తలెత్తిన ప్పుడు మంచినీటి సహాయకులే మరమ్మత్తులు చేసుకునే విధంగా ఈ శిక్షణ ఎంతో తోడ్పడుతున్నట్లు చెప్పారు. నాలుగు రోజులపాటు ఇచ్చే ఈ శిక్షణ తరగతుల మొదటి రోజు హ్యాండ్ పంప్స్ రెండవ రోజు వాటర్ క్వాలిటీ, మూడవరోజు పైప్లైన్ డీకేజీ అరికట్టడం, నాలుగో రోజు వాటర్ పంప్ సెట్ లపై శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు. పటాన్ చెరు నియోజకవర్గంలో చిన్న గ్రామా పంచాయితీ లో ఒక్కరు, పెద్ద గ్రామా పంచాయతీలో ముగ్గురు చొప్పున 615 మందికి శిక్షణ ఇస్తున్నట్లు తెలియజేశారు. ఈ శిక్షణ తరగతుల వల్ల చిన్నచిన్న మరమ్మత్తులు చేసుకోవటం, నీటి నాణ్యత, కరెంటు ఓల్టేజీ, సమస్యలు పరిష్కారం అవడంతో పాటు ప్రజలకు స్వచ్ఛమైన మంచినీటి సరఫరా చేయటానికి వీలు పడుతున్నట్లు ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మిషన్ భగీరథ ఈ ఈ షేక్ పాషా, డిఈలు శ్రీనివాస్, సుచరిత, ఎంపీడీవో యాదగిరి, ఎంపీ ఓ హరి శంకర్ గౌడ్ గ్రామ మంచినీటి సరఫరా సహాయకులు తదితరులు పాల్గొన్నారు