పంచాయతీ పాలకవర్గం ఆధ్వర్యంలో అమరవీరుల దినోత్సవం

– ముగిసిన దశాబ్ది ఉత్సవాలు
నవ తెలంగాణ-మద్నూర్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు ఈనెల రెండున ప్రారంభించగా ఈ దశాబ్ది ఉత్సవాలు ఈనెల 22 తో ముక్యాయి 22వ తేదీ దశాబ్ది ఉత్సవాలు భాగంగా మద్నూర్ మండల కేంద్ర మేజర్ గ్రామపంచాయతీలో పాలకవర్గం ఆధ్వర్యంలో అమరు వీరుల దినోత్సవం పెద్ద ఎత్తున నిర్వహించారు. అమరుల స్తూపానికి టెంకాయలు కొడుతూ నివాళులర్పించారు. అమరవీరులకు జోహార్లు అమరవీరులకు జోహార్లు అంటూ పాలకవర్గం పంచాయతీ కార్యదర్శి సిబ్బంది కలిసి అమరులకు శాంతి కలగాలని మౌనం పాటించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ సురేష్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన అమరవీరులతోనే సాధ్యమైందని అమరులైన ప్రతి ఒక్కరికి వారి ఆత్మశాంతి కలగాలని ఆ భగవంతునితో కోరుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి సందీప్ పంచాయతీ అధికారులు, పాలకవర్గం సభ్యులు మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బన్సీ పటేల్, గ్రామ రైతు సమన్వయ సమితి సభ్యులు కంచిన్ హనుమాన్లు కర్రీ వార్ రాములు తదితరులు పాల్గొన్నారు.