నవతెలంగాణ – కామారెడ్డి
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు ఐలమ్మ 129 వ జయంతి వేడుకల సందర్భంగా గురువారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని రోడ్లు భవనాల శాఖ ఆతిథి గృహం ముందు గల చాకలి ఐలమ్మ విగ్రహానికి టిఆర్ఎస్ పార్టీ కామారెడ్డి జిల్లా అధ్యక్షులు ఎంకే ముజిబొద్దిన్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించరు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన ప్రజల కోసం పోరాటం చేసిన గొప్ప పోరాట యోధురాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు జాకంటి ప్రభాకర్ రెడ్డి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పిప్పిరి వెంకటి, గైని శ్రీనివాస్ గౌడ్, కౌన్సిలర్లు నజీరోద్దిన్, హఫీజ్ బెగ్, గెరిగంటి స్వప్న లక్ష్మినారాయణ, కృష్ణజిరావు, కాసర్ల స్వామి, యూత్ పట్టణ అధ్యక్షుడు చిలిమెల భానుప్రసాద్ మరియు బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు జగదీష్ యాదవ్, కొత్తింటి శ్రీనివాస్ రెడ్డి,నరేష్ రెడ్డి, గోపు నర్సింలు, మనూసుర్ తదితరులు పాల్గొన్నారు.