రేషన్ డీలర్ల నూతన కార్యవర్గం ఎన్నిక

Election of new working group of ration dealersనవతెలంగాణ – ఆర్మూరు 
మండలంలోని 27రేషన్ దుకాణలా యజమానులు నూతన రేషన్ డీలర్ కార్యవర్గం యొక్క ఎన్నికలు గురువారం పట్టణంలో నిర్వహించినారు.. నూతన అధ్యక్షుడిగా అబ్దుల్ అజీం, కార్యదర్శిగా కామని నరేష్, కోశాధికారిగా పిప్రి శ్రీనివాస్ గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్బంగా అధ్యక్షుడు  మాట్లాడుతూ రేషన్ డీలర్లకు ఎలాంటి సమస్యలు ఉన్న సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని అన్నారు. నూతన అధ్యక్షుడుగా నన్ను ఎన్నుకునందుకు ప్రతివోక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా వారు ఎమ్మార్వో గజానన్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. నూతన కార్యవర్గానికి ఆయన శుభాకాంక్షలు తెలిపి స్విట్లను అందజేశారు.కార్యదర్శి కామని నరేష్, క్యాషీర్ పిప్రి శ్రీనివాసగౌడ్,ఎన్నికయారు ఈ కార్యక్రమంలో డీలర్లు బొడ్డు రమేష్, వెంకన్న, గుండెం రమేష్, కిషన్, హర్షద్,ఆశన్న, మగ్గిడి నర్సయ్య, సురేష్ ,రాజలింగం, తదితరులు పాల్గొన్నారు.