నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మండల కేంద్రంలోని వ్యవసాయ ప్రాథమిక పరపతి సంఘం సింగిల్ విండో 55వ మహాజనసభ ఈనెల 27న శుక్రవారం ఉదయం 10:30 గంటలకు సింగిల్ విండో చైర్మన్ శ్రీనివాస్ పటేల్ అధ్యక్షతన కార్యాలయ భవనంలో నిర్వహించడం జరుగుతుందని సంఘం కార్యదర్శి జే బాబురావు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మహాజనసభకు సంఘం కార్యవర్గ సభ్యులు వ్యవసాయ రైతులు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని కార్యదర్శి కోరారు.