
గ్రామపంచాయతీ కార్మికులు అనేక సంవత్సరాలుగా పని చేస్తూ ఉన్నారని వారికి ఎటువంటి గుర్తింపు లేదని, చాలీచాలని జీతాలతో వేట్టి చాకిరి చేయిస్తుందని, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాడి పది నెలలు ప్రయాణం అవుతున్న ఇప్పటికీ గ్రామపంచాయతీ కార్మికులను పర్మినెంట్ చేయక ఈఎస్ఐ పిఎఫ్ లేక అనేక ఇబ్బందులు పడుతున్నారని 30 న చలో హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద జరిగే ధర్నాను విజయవంతం చేయాలని గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ జిల్లా నాయకులు జేపీ గంగాధర్ అన్నారు. గురువారం మండలం లోని మెంట్రజ్ పల్లి గ్రామ పంచాయతీ వద్ద ధర్నా పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మూడు దఫాలుగా దేశాన్ని పరిపాలిస్తున్నాడని, కార్మిక చట్టాలను మార్చేసి 4 లేబర్ కోడ్లను తీసుకువచ్చి కార్మికులకు ఉరితాడు చట్టాలు తెచ్చాడని విమర్శించారు. ఈ నాలుగు చట్టాలను వెంటనే రద్దుచేసి కార్మికులు కొట్లాడి సాధించుకున్న హక్కులను లేదా విధిగా ఉంచాలని బీజేపీ సర్కార్ను హెచ్చరిస్తూ న్నామన్నారు. 30 న జరిగే ధర్నాను విజయవంతం చేయాలని గ్రామపంచాయతీ కార్మికులను విజ్ఞప్తి చేస్తున్నాట్లు పేర్కొన్నారు.ఈ కార్యక్రమం లో బిల్ కలెక్టర్ షేక్ అసిఫ్ తోపాటు సిబ్బంది ఉన్నారు.