పండ్ల చెట్ల పెంపకం ద్వారా రైతుల ఆదాయాన్ని పెంచడంపై ఏజీఐ గ్రీన్ప్యాక్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్యక్రమాన్ని జిల్లా ఉద్యానశాఖ అధికారి సుభాషిణి, మండల ఉద్యమన శాఖ అధికారి మాధవి లు అభినందించారు. గురువారం భువనగిరి మండలంలోని గౌస్ నగర్ రైతు వేదికలో పండ్ల చెట్ల పెంపకం పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పాముచెట్టు, అంతరపంటగా పుచ్చకాయ వంటి ఇతర పంటలను పండించేలా ఆమె రైతులను చైతన్యపరిచారు. అచ్యుతా చారి పుచ్చకాయ సాగుపై 45 నిమిషాల ప్రజంటేషన్ ద్వారా రైతులకు సాంకేతిక సమాచారాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారి సతీష్ కుమార్ , దిలాసా ప్రాజెక్ట్ మేనేజర్ అమిత్ కుమార్, వివిధ గ్రామాల రైతులు పాల్గొన్నారు.