– నెల్లికుదురు సెక్టర్ సూపర్వైజర్ నాగమణి
– వావిలాల సెక్టర్ ఇన్చార్జి సూపర్వైజర్ మల్లీశ్వరి
నవతెలంగాణ – నెల్లికుదురు
గర్భిణీ స్త్రీలకు బాలింతలకు కిశోర బాలికలకు పోషక విలువలు కలిగిన ఆహార పదార్థాలను పెట్టాలని ఐసిడిఎస్ నెల్లికుదురు సూపర్వైజర్ నాగమణి వావిలాల ఇన్చార్జి సూపర్వైజర్ మల్లీశ్వరి అన్నారు. మండలంలోని మునిగలవీడు, నర్సింహులగూడెం, గ్రామాలలో నెల్లికుదురు వావిలాల సెక్టర్ ఆధ్వర్యంలో ఘనంగా పోషక వారోత్సవాలను గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్న ప్రసన్న కార్యక్రమం నిర్వహించారు. ఎక్కువ పోషక విలువలు కలిగిన ఆహార పదార్ధాలు గర్భిణీ లు బాలేంతలు కిషోర బాలికలు 7 నెలల నుండి 5 సంవత్సరాల పిల్లల కు తప్పక అంది ఇవ్వాలని తెలిపారు. రక్తహీనత కు గురి కాకుండా చూడాలని పిల్లలలో వయసు తగిన ఎత్తు, వయసు కు తగిన బరువులు, ఎత్తు కు తగిన బరువులు ఉండాలని సామ్ మామ్ లో ఉన్న పిల్లలకు బాలామృతం ప్లస్ తినిపించాలని సూచించారు. గర్భిణీ, బాలేoతల కు అంగన్వాడీ సెంటర్ లో పెట్టె భోజనం తినాలని ప్రి స్కూల్ పిల్లలను ప్రవైట్ స్కూల్ కు పంపద్దు అని అంగన్వాడీ సెంటర్స్ కే పంపించాలని అవగాహనా కల్పించినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో పల్లె దావకాన డాక్టర్ త్రివేణి రమ్య పంచాయతీ కార్యదర్శి మణిదీప్ వావిలాల సెక్టార్ నెల్లికుదురు సెక్టర్ అంగన్వాడీ టీచర్లు హిమబిందు ఊర్మిళ వీరలక్ష్మి వెంకటమ్మ జమాల్బి మహతి సరోజన రాజేశ్వరి మంజుల వరాలమ్మ దేవి శ్రీలక్ష్మి విజయ పద్మ తోపాటు వివిధ గ్రామాల అంగన్వాడి టీచర్లు ఆశ వర్కర్లు పాల్గొన్నారు.