నవతెలంగాణ – రామారెడ్డి
మండలంలోని ఇసన్న పల్లి (రామారెడ్డి) లో వెలసిన శ్రీ కాలభైరవ స్వామి ఆలయ ప్రాంగణంలో ఈనెల 30వ తేదీన ఉ 11-00 గం లకు కిరాణం, టెంకాయలు, స్వామి వారి లడ్డు, పులిహోర, పూజా సామాగ్రి, వడ మొదలగు వాటికి రెండు దుకాణాలకు నవంబర్ 1వ తేదీ నుండి సంవత్సరం పాటు కు ఆలయ ప్రాంగణంలో బహిరంగ వేలం నిర్వహించబడునని, వ్యాపారస్తులు వేలంపాటలో పాల్గొనాలని, షరతులు వేలం సమయంలో తెలుపబడునని ఆలయ ఈవో ప్రభు ఒక ప్రకటనలో గురువారం తెలిపారు.