
చౌటుప్పల్ మండలం గుండ్లబావి గ్రామపంచాయతీ పరిధిలోని రెడ్డి భావి గ్రామంలో మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సహకారంతో 10 లక్షల హెచ్ఎండిఏ నిధులతో గౌడ సంఘ భవనానికి మాజీ జెడ్పిటిసి చిలుకూరు ప్రభాకర్ రెడ్డి మండల ఇంచార్జ్ పబ్బు రాజు గౌడ్ శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా చిలుకూరి ప్రభాకర్ రెడ్డి పబ్బు రాజు గౌడ్ మాట్లాడుతూ.. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో చౌటుప్పల్ మండలాన్ని మరింత అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు బోయ దేవేందర్, కాంగ్రెస్ బ్లాక్ అధ్యక్షులు ఆకుల ఇంద్రసేనారెడ్డి మున్సిపల్ అధ్యక్షులు సూర్వి నరసింహ గౌడ్,అర్ధ వెంకటరెడ్డి బొడిగె బాలకృష్ణ గౌడ్ గుండ్లబావి కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షులు గంగాపురం వెంకటేశం గుండ్లబావి గౌడ సంఘం అధ్యక్షులు బాలాగోని ఆంజనేయులు గౌడ్,నందగిరి పరమేష్,మాధగోని రామస్వామి,పల్లె జంగయ్య,పల్లె శేఖర్, నందగిరి నరసింహ,నందగిరి మల్లయ్య,గౌడ సంఘం నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గౌడ సంఘం అధ్యక్షులు మాట్లాడుతూ.. రెడ్డిబావి గౌడ సంఘం భవనానికి 10 లక్షల రూపాయలు కేటాయించిన ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.మేము అడగగానే మా సంఘానికి 10 లక్షల కేటాయించినందుకు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. గౌడ సంఘం శంకుస్థాపన కార్యక్రమానికి వచ్చిన నాయకులకు గౌడ సంఘం నేతలు శాలువాలతో ఘనంగా సన్మానించారు. అలాగే దీనికి సహకరించిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు మా సంఘం తరఫున కృతజ్ఞతలు తెలిపారు.