జాతీయ సేవా పథకంలో భాగంగా అవగాహన సదస్సు

Awareness seminar as part of National Service Schemeనవతెలంగాణ – కంఠేశ్వర్

నగరంలోని గిరిజన మహిళ డిగ్రీ కళాశాలలో జాతీయ సేవా పథకంలో భాగంగా స్వచ్ఛత హి  సేవ  డే -10 లో భాగంగా నాగారంలోని ఫిఫ్త్ టౌన్ నుండి ఎస్ఐ వారి బృందం కళాశాల విద్యార్థులకు సైబర్ సెక్యూరిటీ ,మేనేజ్మెంట్ రూల్స్, సంచార్ సతి  పోర్టల్ లో కంప్లైంట్ ఎలా చేయాలి అనే అంశాలపై విద్యార్థినిలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఐక్యూఎస్సీ కోఆర్డినేటర్ సీఎస్ డిపార్ట్మెంట్ అధ్యాపకురాలు సుష్మిత విద్యార్థులకు ఫోన్ వాడకం, వాట్సాప్ వాడకం ,వెబ్సైట్ ని ఎలా ఉపయోగించాలి అనే అంశాల మీద అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో  ప్రిన్సిపల్ , వైస్ ప్రిన్సిపల్ జి . భార్గవి.ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ వి. జి లక్ష్మి అధ్యాపక బృందం విద్యార్థులు పాల్గొన్నారు. ఇంకా చాకలి ఐలమ్మ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు.