ట్రాక్టర్ దొంగలను అదుపులోకి తీసుకున్న పోలీసులు

– జైలుకు తరలింపు
నవతెలంగాణ-మల్హర్ రావు : ట్రాక్టర్ దొంగిలించిన దొంగలను పట్టుకొని జైలుకి తరలించినట్లుగా కొయ్యుర్ ఎస్ఐ వడ్లకొండ నరేశ్ శుక్రవారం తెలిపారు. ఎస్ఐ పూర్తి కథనం ప్రకారం. మండల కేంద్రమైన తాడిచెర్ల గ్రామానికి మహేందర్,రాజు అనే వ్యక్తులు గ్రామ శివారులో జూన్ 7వ తేదీన వ్యవసాయ పొలాల వద్ద ఉంచబడిన ట్రాక్టర్ ను దొంగిలించి పెద్దపల్లి జిల్లాలోని సుల్తానాబాద్ పట్టణానికి చెందిన స్వామి అనే వ్యక్తి ద్వారా ముల్కనూర్ గ్రామానికి చెందిన అశోక్ అనే వ్యక్తికి విక్రయించారని తెలిపారు.ఈ ఘటనపై కొయ్యుర్ పోలీస్ స్టేషన్లో ట్రాక్టర్ యజమాని ఇటీవల పిర్యాదు చేయగా పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి దొంగిలించిన ట్రాక్టర్ ను గురువారం పట్టుకొని నిందితులను అదుపులోకి తీసులోని విచారణ చేపట్టగా దొంగతనం చేసినట్లుగా నిందితులు ఒప్పుకొన్నట్లుగా  పేర్కొన్నారు. దొంగ ట్రాక్టర్ అని తెలిసి కొన్న వ్యక్తితో  సహా నలుగురు వ్యక్తులను జైలుకు పంపినట్లుగా వివరించారు.