నవతెలంగాణ-కౌటాల
గ్రామాలలో శుద్ధ జలం ప్రమాణాలను గ్రామ స్థాయి సిబ్బంది ఎప్పటికప్పుడు నీటి ప్రమాణాలను పరిశీలించాలని మిషన్ భగీరథ డీఈఈ పృథ్వీరాజ్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో మిషన్ భగీరథ గ్రామ సిబ్బందికి ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామస్థాయిలో పనిచేస్తున్న మిషన్ భగీరథ సిబ్బంది ఎప్పటికప్పుడు మిషన్ భగీరథ నీటి ప్రమాణాలను పరిశీలించి ఎలాంటి అనుమానాలు వచ్చిన వెంటనే ఉన్నత అధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు. అన్ని గ్రామాలలో గ్రామస్తులకు శుద్ధ జలం అందించడమే లక్ష్యంగా పనిచేయాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ కోట ప్రసాద్, ఏఈఈ మృదయ వీర్ పాల్గొన్నారు.