
ఉచిత శిక్షణ సద్వినియోగం చేసుకుంటూ భవితకు స్వయం ఉపాధి బాటలు వేయాలని (నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ )భవన నిర్మాణ రంగ కార్మికుల సంక్షేమ మండలి ఆధ్వర్యంలో నిర్వహించే ఈ ఉచిత నైపుణ్య శిక్షణను సద్వినియోగం చేసుకొని ఉపాధి మార్గాన్ని ఎంచుకోవాలని ఆ సంస్థ ట్రైనర్ కరణ సాగర్ అన్నారు. శనివారం మండల పరిధిలోని చిల్పకుంట్లలో గత 15 రోజులుగా శిక్షణ ఇచ్చి వారికి పనికి ఉపయోగపడే కిట్టును ఉచితంగా అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 15 రోజులకు ఒక బ్యాచ్ చొప్పున కార్మిక శాఖ పరిధిలో నమోదు అయి ఉన్నవారికి ఉచిత శిక్షణతో పాటు పని చేసేందుకు అవసరమైన కిట్టును అందిస్తున్నామని తెలిపారు శిక్షణ కాలంలో రోజుకు రూ.300 రూపాయల చొప్పున వేతనం చెల్లిస్తూ శిక్షణ పూర్తి అయిన తర్వాత ధ్రువపత్రం అందజేస్తున్నామని అన్నారు. దీంతో గ్రామాల్లో ఉచిత శిక్షణకు కార్మికుల నుంచి మంచి స్పందన లభిస్తుందని తెలిపారు. ఇప్పటికే ఈ గ్రామంలో అనేక బ్యాచిలర్ శిక్షణ ఇచ్చామని అన్నారు. ఇట్టి అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలి కోరారు ఈ ఈ బ్యాచ్ లో శిక్షణ తీసుకున్న వారిలో బత్తుల నాగమల్లు బొజ్జ శ్రీను , సామ శ్యాంసుందర్ రెడ్డి ఉప్పల పరమేష్ ,తొట్ల ఉప్పలయ్య ,శేఖర్ ,సామ సాయి రెడ్డి ,తదితరులు ఉన్నారు.