– సుమారు 11 కిలోల గంజాయి స్వాధీనం
నవ తెలంగాణ – పటాన్ చెరు
పటాన్ చెరు మండలం ఇస్నాపూర్ పరిధిలో వేరు వేరు చోట్ల గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్, టాస్క్ ఫోర్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరు వ్యక్తులు పరారీలో ఉన్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బనారస్ కు చెందిన శంభు సింగ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లాకు చెందిన పట్టాష హర్షవర్ధన్ ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు. శుక్రవారం ఒక వ్యక్తి నుండి 670 గ్రాముల గంజాయి, శనివారం మరో వ్యక్తి నుండి 10.198 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరిపై నమోదు చేసి ఇద్దరిని రిమాండ్ కు తరలించినట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు