సాగర్ మున్సిపాలిటీలో సీసీ రోడ్ల పనులు ప్రారంభం

The work of CC roads has started in Sagar Municipalityనవతెలంగాణ -పెద్దవూర
పెద్దవూర మండలం నాగార్జునసాగర్ మున్సిపాలిటీలోనీ 6 వ వార్డులో సీసీ రోడ్ల పనులను సాగర్ ఎంఎల్ఏ  కుందూరు జైవీర్ రెడ్డి సహకారంతో సీసీ రోడ్ల పనులను మాజీ జిల్లా జడ్పీవైస్ చైర్మన్ కర్నాటి లింగారెడ్డి,నందికొండ మున్సిపాలిటీ చైర్మన్ తిరుమల కొండ అన్నపూర్ణ, ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్బంగా వార్డు కాలనీ వాసవిలు మాట్లాడుతూ.. కొన్ని సంవత్సరాల నుండి ఈ రోడ్డు కోసం ఎదురు చూశామని ఎంతోమంది అధికారుల దగ్గరికి తిరిగామని,ఎన్నో ఇబ్బందులు పడ్డామని మాయొక్క బాధలు విన్న నాగార్జునసాగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే జైవీర్ వెంటనే  సీసీ రోడ్లు మంజూరు, చేయించడం, చాలా సంతోషకరంగా ఉన్నదని తెలిపారు. ఆరో వార్డు కాలనీ ప్రజలు ఎంఎల్ ఏకు,చైర్మన్ ,వైస్ చైర్మన్, కమిషనర్, కౌన్సిలర్ ఇర్లరామకృష్ణ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ ఆదాసు నాగరాణి విక్రమ్, 5 వ వార్డు కౌన్సిలర్ హీరకార్ రమేష్జీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు రంగారెడ్డి, పగడాల నాగరాజు, కాంట్రాక్ట్ సీతారాం నాయక్, మంద కిషోర్,చిత్రంశ్యాము,పిట్ట సైదులు, లక్ష్మయ్య, వెంకటేశ్వర్లు,మహిళలు తదితరులు పాల్గొన్నారు.