గ్రామీణ స్వయం సహాయక ఉత్పత్తుల ప్రదర్శన, విక్రఎం విక్రమ్ ఎగ్జిబిషన్ సరస్ ఫెయిర్ 2024 ను సందర్శించడానికి యాదాద్రి భువనగిరి జిల్లా నుంచి డిఆర్డిఓ ఆధ్వర్యంలో మహిళా సంఘాల ప్రతినిధులు 85 మంది బయలుదేరి వెళ్లారు. కాగా ఆదివారం డి ఆర్ డి ఓ టీ నాగిరెడ్డి జెండా ఊపి, బస్సును ప్రారంభించారు. ఈ ఫెయిర్ లో ఆంద్రప్రదేశ్, మధ్యప్రదేశ్, తెలంగాణా ,రాజస్థాన్, గోవా, అస్సాం, తమిళనాడు రాష్ట్రముల నుండి హస్తకళలు, స్వయం సహాయక సంఘముల ద్వారా తయారు చేసిన వస్తువులు సందర్శన విక్రయము నిమిత్తం సరస్ ఫెయిర్ 2024 ప్రదర్శిస్తారు. ఈ ఎగ్జిబిషన్ పీపుల్స్ ప్లాజా , పీ.వీ.యన్ మార్గ్ ( నెక్లెస్ రోడ్) నందు సెప్టెంబర్ 27వ తేదీ నుంచి అక్టోబర్ ఏడవ తేదీ వరకు నిర్వహించబడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమములొ జిల్లా టి నాగిరెడ్డి, జిల్లా గ్రామీణాభివృద్ధి అదికారి విజిలెన్స్ అధికారి మందడి ఉపెందర్ రెడ్డి ,విజిలెన్స్ అదికారి, మహిళా సంఘము సభ్యులు, డి.పి.ఎం. , ఎపిఎం లు పాల్గొన్నారు.