జెమినీ టీవీ యాంకర్‌గా చేసి, నిన్ను చూస్తూ సినిమాతో హీరోయిన్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన హేమలత రెడ్డి గ్లామన్ మిసెస్ ఇండియా 2024 అవార్డుల్లో బెస్ట్ టాలెంట్, బెస్ట్ ఫోటోజెనిక్ విభాగాల్లో పురస్కారాలను సొంతం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో నిర్వహించిన గ్రాండ్ సెలబ్రేషన్స్‌లో హీరోయిన్ హేమలత రెడ్డి మాట్లాడుతూ, ‘నేను ఎప్పటి నుండో ఇండిస్టీలో ఉన్నాను. జెమిని టీవీలో యాంకర్‌గా మొదలుపెట్టి సీరియల్స్ చేశాను. ఆ తరువాత ప్రొడక్షన్ మీద ఇంట్రెస్ట్‌తో ప్రొడ్యూసర్‌గా ఒక సినిమా తీశాను. ఆ తర్వాత ఫ్యాషన్ సైడ్ ట్రై చేశాను. వర్చువల్ రౌండ్స్‌ని కంప్లీట్ చేసి, ఫైనల్ సెలక్షన్స్‌కి మలేషియా వెళ్లాను. అక్కడ పోటీ చాలా గట్టిగా నడిచింది. దక్షిణాది నుండి నేను మాత్రమే వెళ్లగలిగాను. చివరికి గెలిచాను. మన మాత భాష తెలుగులోనే నేను అక్కడ ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చాను. నేను గెలుస్తానని అనుకోలేదు. నేను హీరోయిన్‌గా నటిస్తూ నిర్మించిన సినిమా ‘నిన్ను చూస్తూ’. ఆ సినిమాలో సుహాసిని, సుమన్, షాయాజీ షిండే లాంటి సీనియర్ నటులతో నటించాను. వాళ్ల దగ్గర నుంచి ఎంతో నేర్చు కున్నాను. ముఖ్యంగా సుహాసిని ఎన్నో మంచి టిప్స్ ఇచ్చారు. ఆవిడ నాకు స్ఫూర్తి. అలాగే నాకు మా కుటుంబం నుండి మంచి సపోర్ట్ లభించింది. ఆఫర్ వస్తే ఎలాంటి రోల్స్ అయిన చేస్తాను’ అని తెలిపారు. ‘గ్లామన్ మిస్ అండ్ మిస్సెస్ ఇండియా పోటీని నిర్వహించడం చాలా ఆనందంగా ఉంది. 39 సిటీలలో 60 మంది కంటెస్టెంట్స్‌ని సెలెక్ట్ చేసాం. 35 మందిని మలేషియా తీసుకెళ్లాం. టైటిల్ విన్నర్‌గా హైదరాబాద్ అమ్మాయి హేమలత రెడ్డి గెలిచారు. ఇప్పుడు గ్లామన్ మిస్ అండ్ మిస్సెస్ వరల్డ్ కాంపిటీషన్ చేస్తున్నాం. 149 దేశాల నుంచి ఎంట్రీస్‌ని తీసుకుంటున్నాం. ఆ ఫినాలేని ప్యారిస్‌లో ప్లాన్ చేస్తున్నాం. ఈపోటీకి హేమలతరెడ్డిని కూడా తీసుకెళ్తున్నాం’ అని గ్లామన్ డైరెక్టర్ మన్ దువా చెప్పారు.