నవతెలంగాణ – తూప్రాన్
బలహీనుల, అసహాయులకు అండగా నిలవడమే పత్రికల ప్రధాన లక్ష్యమని సీఎండీ గిరీష్ కుమార్ సంఘీ పేర్కొన్నారు.ఉమ్మడి మెదక్ జిల్లా పూర్వ మిత్రుల సమ్మేళనం కార్యక్రమం శివశంకర్ అధ్యక్షతన హత్నూర మండలంలోని మల్కాపూర్ చౌరస్తా లోని వి ఎస్ ఆర్ గార్డెన్స్ లో నిర్వహించారు..ఈ సందర్బంగా ముఖ్య అతిధిగా పాల్గొన్న గిరీష్ కుమార్ సంఘీ మాట్లాడుతూ తెలుగు రాష్ట్ర చరిత్ర లో ఒకేసారి 9 ఎడిషన్ లతో ప్రారంభించి ప్రజల సమస్యలే పరమావదిగా పనిచేయడం జరిగిందన్నారు.ఈ సందర్బంగా నాటి సంచలన కథనాలను,జర్నలిస్ట్ లకు ఇచ్చిన స్వేచ్చ ను గుర్తు చేసుకున్నారు..నాటి ప్రజా ఉద్యమాల్లో, తెలంగాణ ఉద్యమంలో కీలకమన్నారు. చెట్టుకొక్కరు పుట్టకొక్కరు ఉన్న పాత పాత్రికేయ మిత్రులకు ఒక్కదగ్గరికి చేర్చి సమావేశం నిర్వహించడం సంతోషంగా ఉందని,కృషి చేసిన శివ శంకర్, రామ కృష్ణారెడ్డి లను ఆయన అభినందించారు.ప్రముఖ సంపాదకులు రామచంద్రామూర్తి మాట్లాడుతూ సీఎండీ సంఘీ ఇచ్చిన ప్రోత్సాహం మరువలేమన్నారు.తాను ఉత్సాహంతో పనిచేయడం జరిగిందన్నారు.వార్త లో దగాపడ్డ తెలంగాణ పేరిట ప్రముఖులతో 32 వ్యాసాలు వ్రాయడం జరిగిందన్నారు.బి ఎస్ పి అధినేత ఎప్పుడు హైదరాబాద్ వొచ్చినా వార్త కార్యాలయంకు వొచ్చి సంఘీ గారిని కలిసే వారని,ప్రజా సమస్యలు చర్చించేవారు.పూర్వ ఎడిటరియల్,అడ్వార్టైజ్ సిబ్బంది లక్షణరావు, నేట్వర్క్ శ్రీనివాస్, ఉపేంద్ర, మాజీ ఎమ్మెల్సీ,పూర్వ ఉమ్మడి జిల్లా ప్రతినిధి ఆర్ సత్యనారాయణ,కల్వల మల్లిఖార్జున్ రెడ్డి, కప్పర ప్రసాద్ తదితరులు మాట్లాడుతూ గత అనుభవాలను నెమరు వేసుకున్నారు.ఈ సందర్బంగా వారిని శాలువాలతో సత్కరించి, మేమేంటోలు బహుకరించారు. ఈ కార్యక్రమం లో పూర్వ పాత్రికేయ మిత్రులు మన కర్తవ్యం ఎం.డి జానకిరామ్ సిఆర్, సీనియర్ జర్నలిస్ట్ పెద్దిగారి నగేష్, శివ శంకర్ రావు, రామకృష్ణ రెడ్డి, అన్వర్ హుసేన్, రాజగోపాల్, బాల్ చందర్, చంద్ర శేఖర్ రెడ్డి, కనకరాజు,సుమారు 100మంది పాల్గొన్నారు