దుర్గామాత దేవాలయాన్ని సందర్శించిన విద్యార్థినిలు

Students visit Durga Mata Templeనవతెలంగాణ – కంఠేశ్వర్ 

నగరంలోని తెలంగాణ గిరిజన గురుకుల సంక్షేమ మహిళా డిగ్రీ కళాశాలలో స్వచ్ఛత ఈ సేవ కార్యక్రమంలో భాగంగా సోమవారం ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు గొల్ల గుట్ట తండాలోని దుర్గామాత అమ్మవారి దేవాలయాన్ని సందర్శించారు. దేవాలయాల సందర్శన వలన యువతలో ఆధ్యాత్మికత ను పెంపొందించి నైతిక బాధ్యతను కలిగి ఉండే సమాజ పౌరులుగా తీర్చిదిద్దబడతారని కళాశాల ప్రిన్సిపల్ సైదా జైనాబ్ తెలియ జేశారు. చారిత్రక దేవాలయాలు, శిల్పాలు రాబోయే భావితరాలకు చిహ్నాలుగాను ఉంటాయని వైస్ ప్రిన్సిపాల్ జి. భార్గవి సూచించారు. ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు దేవాలయము సందర్శించి దేవాలయాల చుట్టూ ఉన్న పరిసరాలను శుభ్రం చేసి చుట్టూ ఉన్న చెత్తాచెదారాలను ఎత్తివేశారు. నీటితో ఆవరణన్ని శుభ్రం చేశారని ఎన్ ఎస్ ఎస్ పి ఓ వి. జి. లక్ష్మి మరియు అధ్యపకులు సిందురా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎల్ ఎస్ ఎస్ వాలంటీర్లు అధ్యాపక బృందం పాల్గొన్నారు.