బాల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ లో తృతీయ స్థానంలో నిలిచిన బాలుర జట్టు

నవతెలంగాణ – కంఠేశ్వర్ 
25 వ తేది నుండి 29వ తేది వరకు హర్యానా రాష్టంలోని రోతక్ లో జరిగిన 43వ జాతీయ సబ్ జూనియర్ బాల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ లో తెలంగాణ బాలుర జట్టు తృతీయ స్థానంలో నిలిచింది అని నిజామాబాద్ బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ జిల్లా జనరల్ సెక్రెటరీ శ్యామ్ సోమవారం తెలిపారు. తెలంగాణ బాలురా జట్టు ఉత్తర్ ప్రదేశ్ పై 35-12, 35-10, తెలంగాణ బాలుర జట్టు జెకే జట్టు పై 35-12,35-15, తెలంగాణ బాలుర జట్టు హిమాచల్ ప్రదేశ్ పై 35-17,35-9.తెలంగాణ బాలుర జట్టు  చతిస్గడ్పై 25-35 35_20,35-24,తెలంగాణ బాలుర జట్టు రాజస్థాన్ పై 35-31, 35-21గెలిచి  క్వార్టర్ ఫైనల్స్ లో తెలంగాణ బాలుర జట్టు హర్యానా జట్టు పై 35-29,35-20. గెలిచి  సెమీఫైనల్ లో  తమిళనాడు జట్టుపై 27-35,28-35 తేడాతో ఓడిపోయి. థర్డ్ ఫోర్త్ ప్లేస్  మ్యాచ్లో బీహార్ జట్టు పై విజయం సాధించి తృతీయ స్థానాన్ని కైవసం చేసుకుంది.  తెలంగాణ బాలుర జట్టు తృతీయ స్థానం పొందడం పట్ల.తెలంగాణ రాష్ట్ర బాల్ బ్యాడ్మింటన్ సంఘం అధ్యక్షులు డాక్టర్ బంగారి స్వామి గారు, ప్రధాన కార్యదర్శి.వి. వి రమణ, బాల్ బ్యాడ్మింటన్ అఫ్ ఇండియా అడ్వైజరీ శ్రీనివాస్ రావు, వీరభద్ర రావు,  వివిఎస్ శ్రీనివాస్ రావు,రవీందర్ గౌడ్, తండావకృష్ణ,కోశాధికారి చిన్నయ్య గౌడ్, ఉపాధ్యక్షులు దుర్గయ, రవీంద్రవర్మ, శ్రీకాంత్ రెడీ, సురేష్, శ్రీనివాస్ రావు, మనిమాధవి, సంయుకకార్యదర్శులు కమల్ కుమార్, రవీందర్, బి. శ్యామ్ స్వామి గౌడ్, తిరుపతి, కవిత. గోపి సూర్యనారాయణ నిజామాబాద్ బాల్ బ్యాడ్మింటన్ సంఘo అధ్యక్షులు మానస గణేష్, వ్యాయమ ఉపాధ్యాయ సంఘం అధ్యక్షులు విద్యాసాగర్ రెడ్డి, రాజేశ్వర్, కృష్ణమూర్తి, నగేష్, సురేష్, సురేందర్, తదితరులు అభినందించారు.