నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
ఓపెన్ యాక్సెస్ ద్వారా పరిశ్రమలు వినియోగించుకొనే కరెంటుపై అడిషనల్ సర్‌చార్జి విధిస్తూ తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (టీజీఎస్‌ఈఆర్సీ) ఉత్తర్వులు జారీ చేసింది. డిస్కంలు యూనిట్‌కు రూ.1.60 పైసలు ప్రతిపాదించగా, ఈఆర్సీ దాన్ని రూ.1.09 పైసలకు ఖరారు చేసింది. పరిశ్రమలు చెల్లించే ఫిక్సెడ్ చార్జీలకు అదనంగా ప్రతి యూనిట్‌కు పై మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. దీనిపై జరిగిన బహిరంగ విచారణలో ఫిక్సెడ్ చార్జీలు ఎత్తేయాలని పారిశ్రామిక సంఘాలు కోరారు. దాన్ని ఈఆర్సీ పరిగణనలోకి తీసుకోలేదు.