మెన్, ఉమెన్ హ్యాండ్ బాల్ ఎంపికలు

Men and Women Handball optionsనవతెలంగాణ – ఆర్మూర్ 
తెలంగాణ రాష్ట్రం హ్యాండ్ బాల్ సంఘం ప్రధాన కార్యదర్శి శ్యామల పవన్ కుమార్  ఆదేశాల మేరకు  మంగళవారం ఉమ్మడి జిల్లాల సీనియర్ మేన్, ఉమెన్ హ్యాండ్ బాల్స్ సెలక్షన్స్ లు నిర్వహించినారు. ఈ ఎంపిక ప్రక్రియ లో నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల నుండి  మెన్ విభాగంలో 50 మంది క్రీడాకారులు, ఉమెన్ విభాగంలో 30 మంది క్రీడాకారిణిలు పాల్గొన్నారని  జిల్లా హ్యాండ్ బాల్ అసోసియేషన్ అధ్యక్షులు గంగ మోహన్ చక్రు, ప్రధాన కార్యదర్శి పింజ సురేందర్ లు తెలిపారు. ఈ ఎంపిక ప్రక్రియలో  మంచి ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను ఈ నెల 9, 10 ,11 వ తేదీలలో  రంగారెడ్డి జిల్లా లో జరగబోయే 53వ  తెలంగాణ రాష్ట్ర స్థాయి సీనియర్ మెన్ అండ్ ఉమెన్  హ్యాండ్ బాల్ పోటీలలో  పాల్గొంటారని తెలిపారు. ఎంపిక ప్రక్రియలను  నిజాంబాద్ జిల్లా హ్యాండ్ బాల్ సంఘం కోశాధికారి గట్టడి రాజేష్ ఆధ్వర్యంలో పి ఈ టి లు సంజీవ్, రాజేందర్  లు నిర్వహించారు.  ఈ కార్యక్రమంలో  స్కూల్ ప్రిన్సిపాల్ పూర్ణచందర్ , పి .డి.,  పి ఈ టి లు భాగ్య, అనూష లు  ఉపాధ్యాయ బృందం, సీనియర్ హ్యాండ్ బాల్ క్రీడాకారులు పాల్గొన్నారు.