కార్తీ, అరవింద్ స్వామి నటించిన చిత్రం ‘సత్యం సుందరం’. ’96’ ఫేమ్ సి ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో 2డి ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై సూర్య, జ్యోతిక నిర్మించారు. ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్స్ ఈ చిత్రాన్ని తెలుగులో గ్రాండ్‌గా రిలీజ్ చేశారు. సెప్టెంబర్ 28న విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులు, విమర్శకుల ప్రసంశలు అందుకుని, బ్లాక్‌బస్టర్ విజయంతో సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన సక్సెస్ మీట్లో హీరో కార్తీ మాట్లాడుతూ, ‘మంచి సినిమాలు చేసినప్పుడు అప్రిషియేట్ చేస్తారు. కానీ ఈ సినిమాకి ప్రేక్షకులు చూపిస్తున్న ప్రేమ కొత్త అనుభూతిని ఇచ్చింది. ఇంత ప్రేమని ఇస్తున్న అందరికీ థ్యాంక్స్. మీరు చూపించిన లవ్‌కి చాలా ఎమోషనల్ అయ్యాను. కొత్త సినిమాలు చేస్తే తప్పకుండా ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకాన్ని ఈ సినిమా మరోసారి రుజువు చేసింది. ఈ సినిమా విజయం ఇలాంటి మరిన్ని సినిమాలు చేయాలనే నమ్మకాన్ని ఇచ్చింది’ అని తెలిపారు. ‘ఈ సినిమాకి మీడియా, ప్రేక్షకులు ఇచ్చిన అప్రిషియేషన్స్ నాకు చాలా కొత్త అనుభూతిని ఇచ్చాయి. ఈ సినిమా, కార్త్తీ పై మీరు చూపిస్తున్న ప్రేమకు ధన్యవాదాలు’ అని డైరెక్టర్ సి ప్రేమ్ కుమార్ చెప్పారు. హీరోయిన్ శ్రీ దివ్య మాట్లాడుతూ,’సినిమాకి మీడియా నుంచి ఇన్ని మంచి ప్రసంశలు రావడం చాలా బావుంది. సినిమాని ఇంత సక్సెస్ చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు. ప్రేక్షకులు చూసి, సక్సెస్ చేస్తేనే ఇలాంటి బ్యూటీఫుల్ ఫిలిమ్స్ ఇంకా వస్తాయి’ అని తెలిపారు. ‘ఈ సినిమా ఇచ్చిన కార్తి, సూర్య, జ్యోతికకి థ్యాంక్స్. ఈ సినిమాలో భాగం కావడం చాలా ఆనందంగా అనిపించింది. తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు ఈ సినిమా చూపించాలని డైరెక్టర్‌కి ఒక ఎడిట్ అడిగాను. దానిని అంగీకరీంచిన ఆయనకి థ్యాంక్స్. చాలా మంచి సినిమా ఇది. తప్పకుండా అందరూ థియేటర్స్‌లో చూడాలి’ అని రాకేందు మౌళి చెప్పారు.