బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం

నవతెలంగాణ – తిరుమలగిరి సాగర్
మండల కేంద్రానికి చెందిన  పగడాల  సైదులు యాదవ్ మరో మారు మానవత్వం చాటుకున్నారు. కుల మతాల ఆతీతంగా ఎంతో మందికి ఆపద సమయంలో  నేనున్నానంటూ ఆదుకుంటూ వారి భుజం తట్టి మనోధైర్యం నింపుతున్నారు. అందుకు నిదర్శనం బుధవారం మండల కేంద్రంలో మేడిపల్లి మల్లమ్మ  మరణించింది. ఈ యొక్క వార్త తెలుసు కున్న అయన ఆమె కుమారుడు మేడిపల్లి జయన్నని పరామర్శించి, ఆమె అంతిమ సంస్కారాల కొరకు 10వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు.