శ్వాగ్‌కి అద్భుతమైన రెస్పాన్స్‌

శ్వాగ్‌కి అద్భుతమైన రెస్పాన్స్‌శ్రీవిష్ణు, డైరెక్టర్‌ హసిత్‌ గోలి కాంబినేషన్‌లో రూపొందిన చిత్రం ‘శ్వాగ్‌’. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీపై నిర్మాత టీజీ విశ్వప్రసాద్‌ నిర్మించారు. శుక్రవారం విడుదలైన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించి, విమర్శకులు ప్రశంసలు అందుకుంది. ఈ నేపథ్యంలో హీరో శ్రీవిష్ణు మాట్లాడుతూ, ‘ప్రేక్షకుల నుంచి చాలా మంచి స్పందన వస్తోంది. ముఖ్యంగా లేడీస్‌, ఫ్యామిలీ ప్రేక్షకుల నుంచి విపరీతమైన అప్రిషియేషన్‌ వస్తోంది. కథ, పెర్ఫార్మెన్స్‌, కొత్త కంటెంట్‌ను ప్రేక్షకులు చాలా అద్భుతంగా రిసీవ్‌ చేసుకుంటున్నారు’ అని అన్నారు. ‘సినిమాలో కొత్త విషయాలని హత్తుకునేలా చెప్పాం. ఆదరిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు’ అని డైరెక్టర్‌ హసిత్‌ గోలి చెప్పారు. నిర్మాత టీజీ విశ్వప్రసాద్‌ మాట్లాడుతూ, ‘శ్వాగ్‌ కమర్షియల్‌ ఫిల్మ్‌. కంటెంట్‌ పరంగా లాంగ్‌ పీరియడ్‌ గుర్తుండిపోయే సినిమా అని నమ్మే తీశాం. మేము అనుకున్నట్లు సినిమా వచ్చింది. అన్ని చోట్ల నుంచి చాలా మంచి రెస్పాన్స్‌ వస్తోంది. సినిమా ఎక్స్‌ట్రార్డినరీగా ఆడుతోంది’ అని తెలిపారు.