మీ ఊహకి మించి..

Beyond your imagination..ధవ సర్జా టైటిల్‌ పాత్రలో నటించిన పాన్‌ ఇండియా చిత్రం ‘మార్టిన్‌’. ఎ.పి.అర్జున్‌ దర్శకత్వంలో వాసవీ ఎంటర్‌ప్రైజెస్‌, ఉదరు కె.మెహతా ప్రొడక్షన్స్‌ బ్యానర్స్‌పై ఉదరు కె.మెహతా, సూరజ్‌ ఉదరు మెహతా ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌ను నిర్మించారు. ఈ చిత్రం దసరా కానుకగా ఈనెల 11న రిలీజ్‌ కాబోతోంది. ఈ క్రమంలో శుక్రవారం చిత్రయూనిట్‌ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించింది. అర్జున్‌ మాట్లాడుతూ, ”మార్టిన్‌’ గురించి చాలా ఖర్చు పెట్టామని చెప్పాల్సిన పని లేదు. టీజర్‌, ట్రైలర్‌, పాటలు చూస్తే అందరికీ తెలుస్తుంది. మా చిత్రం ఈనెల 11న రాబోతోంది. దసరాకి చాలా సినిమాలు వస్తున్నాయి. అన్ని చిత్రాలు చూడండి. మా మూవీని కూడా చూడండి. ధవ సర్జా ఈ చిత్రానికి చాలా కష్టపడ్డాడు. ప్రేక్షకుడు ఎంత ఊహించుకుని వచ్చినా.. అంతకుమించి ఈ సినిమా ఉంటుంది. చాలా గ్యాప్‌ తరువాత ఇలాంటి కమర్షియల్‌ చిత్రం రాబోతోందని చెప్పగలను. వైభవి అద్భుతంగా నటించారు. ప్రేక్షకులు కూడా ఈ మధ్య కాలంలో ఇలాంటి సినిమా రాలేదని కచ్చితంగా చెబుతారని ఆశిస్తున్నాను’ అని తెలిపారు. నిర్మాత ఉదరు కే మెహతా మాట్లాడుతూ, ‘ఈ సినిమాను తెలుగులో చౌదరి డిస్ట్రిబ్యూట్‌ చేస్తున్నారు. ఆయనకు సినిమా పట్ల ఎంతో ప్యాషన్‌ ఉంది. అందుకే ఆయన్ని నమ్మి ఈ చిత్రాన్ని ఆయనకు ఇచ్చాను. అర్జున్‌, ధవ్‌ సర్జా నాకు ఎంతో సపోర్టివ్‌గా ఉన్నారు. వాళ్ళు లేకపోతే ఈ చిత్రం ఇంత బాగా వచ్చేది కాదు.’ అని అన్నారు. ‘ఈ సినిమా నాకు ఎంతో ప్రత్యేకం. నేను పోషించిన ప్రీతి పాత్ర అందర్నీ మెప్పిస్తుంది’ అని నాయిక వైభవి శాండిల్య చెప్పారు.
మా మావయ్య అర్జున్‌ లేకపోతే నేను ఈ స్థాయిలో ఉండేవాడ్ని కాదు. ఈ మూవీని చూడండి.. నాకు టాలెంట్‌ ఉందని అనుకుంటే ఆ తరువాత నా సినిమాలను ఎంకరేజ్‌ చేయండి. లేదంటే వదిలేయండి. కానీ మీకు సినిమా నచ్చితే అందరికీ చెప్పండి.
– హీరో ధవ సర్జా