మంత్రుల ముఖాముఖి సోమవారానికి వాయిదా

– టీపీసీసీ అధ్యక్షులు మహేష్‌కుమార్‌గౌడ్‌
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
ప్రతి శుక్రవారం గాంధీభవన్‌లో పార్టీ నిర్వహిస్తున్న మంత్రుల ముఖాముఖి కార్యక్రమం అనివార్య కారణాల వల్ల సోమవారానికి వాయిదా వేసినట్టు టీపీసీసీ అధ్యక్షులు మహేష్‌కుమార్‌గౌడ్‌ వెల్లడించారు. నిజామాబాద్‌ పర్యటనలో ఉన్న కారణంగా వాయిదా వేస్తున్నట్టు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రజల విజ్ఞప్తులను గాంధీభవన్‌లో సోమవారం స్వీకరించాలని ఆయన మంత్రులకు విజ్ఞప్తి చేశారు. ఈ విషయాన్ని గమనించాలని పార్టీ కార్యకర్తలకు, శ్రేణులకు, ప్రజలను కోరారు.