నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ గజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షులుగా కె.శ్రీనివాసులు ఎన్నికయ్యారు. శుక్రవారం ప్రధాన ఎన్నికల అధికారి శ్యామ్, ఉప ఎన్నికల అధికారి డాక్టర్ రామారావు ఆధ్వర్యంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఈ ఎన్నికకు సంబంధించి సెప్టెంబర్ 23న నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. తాజా ఎన్నికల్లో అసోసియేట్ అధ్యక్షులుగా ఎస్ రామాంజనేయులు, జనరల్ సెక్రెటరీగా సునీల్ రాజ్ , కోశాధికారిగా నామాల శ్రీనివాస్, సంయుక్త కార్యదర్శిగా మంచాల రవీందర్ తో పాటు కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు.
వీరికి రాష్ట్ర అధ్యక్షులు ఏలూరి శ్రీనివాసరావు ధ్రువపత్రాలను అందజేసి ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా కె.శ్రీనివాసులు మాట్లాడుతూ తనను ఎన్నుకున్న సభ్యులకు, రాష్ట్ర నాయకత్వానికి కతజ్ఞతలు తెలిపారు. కేంద్ర సంఘం ఆదేశాల మేరకు సమస్యలపై పోరాడుతానని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ గజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు కలిముద్దీన్ హైమద్ తదితరులు పాల్గొన్నారు.