– ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టులో రూ.లక్ష కోట్ల కుంభకోణం దాగి ఉందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఆరోపించారు. శుక్రవారం హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేతలు చిరుమళ్ల రాకేష్ కుమార్ ,మన్నె గోవర్ధన్ రెడ్డి, తుంగబాలుతో కలిసి ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. కేసీఆర్ హయాంలో రూ.16 వేల కోట్లతో ప్రతిపాదించారని గుర్తుచేశారు. రూ.3,800 కోట్లతో స్పెషల్ ట్రీట్మెంట్ ప్లాంట్లు ,అందమైన బ్రిడ్జిలు నిర్మాణం చేశారని తెలిపారు.సైకో సీఎంగా తయారైన రేవంత్ రెడ్డి శాడిస్టులాగా పేదల ఇండ్లపై పడ్డారనీ, దమ్ముంటే మూసీ దగ్గరికి రావాలని సవాల్ చేశారు. అక్కడికి వస్తే రేవంత్ రెడ్డి వీపును పుచ్చపండు చేస్తారని హెచ్చరించారు. కాళేశ్వరంతో 38 లక్షల ఎకరాలకు నీరు పారుతుందని తెలిపారు.