కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన సంవత్సరం లొనే సమస్యలన్నింటిని పరిష్కరిస్తాం

– నిజామాబాద్ అర్బన్ పరిధిలోని నాగారం 10వ డివిజన్ వాసులతో నిజామాబాద్ మాజీ మేయర్ ధర్మపురి సంజయ్
నవతెలంగాణ- కంటేశ్వర్
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన సంవత్సరంలోనే నాగారం 13 డివిజన్ సమస్యలన్నిటిని పరిష్కరిస్తామని ధర్మపురి సంజయ్ తెలిపారు.నిజాంబాద్ అర్బన్ పరిధిలోని నాగారం పదవి డివిజన్ వాసులతో నిజామాబాద్ మాజీ ఎమ్మెల్యే ధర్మపురి సంజయ్ శుక్రవారం సమావేశం నిర్వహించారు.
నిజామాబాద్ అర్బన్ పరిధిలోని నాగారం 10వ డివిజన్ వాసులతో ఏర్పాటు చేసిన చర్చా వేదికలో కాలనీ వాసులతో, వారి సమస్యలను, వారి ఇబ్బందులను నేటి అధికార పార్టీ మోసాలను నీటి సమస్యలను, రోడ్ల సమస్యలను, పరిసర ప్రాంత పరిశుభ్రత సమస్యలు, మరియు వారికి కొరతగా ఉన్న మురికి కాలువలు, విద్యుత్, వీధి కుళాయిలు, వీధి దీపాలు, స్మశాన వాటిక, విపరీతమైన నీటి కొరత, ఇళ్ల పట్టాలు ఇలా ఎన్నో విషయాలను కాంగ్రెస్ నాయకులు ధర్మపురి సంజయ్ దృష్టికి తీసుకురాగా ఆయన వారి సమస్యలకు తప్పక కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది మన పక్క రాష్ట్రంమైన కర్ణాటకలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను ఏ విధంగా గెలిచిన నాటి నుంచే అమలుచేస్తుందో అదేవిధంగా మీ అందరి సమస్యలకి తప్పక కాంగ్రెస్ అధికారంలో కి వచ్చిన సంవత్సరం లొనే అన్నిటికీ పూర్తిగా పరిష్కరిస్తాం అని హామీ ఇచ్చారు. అందరూ కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపించి అన్ని ప్రాంతాలు నగరాలు, పట్టణాల అభివృద్ధికి కారణమవ్వాలని, మీ అందరికి అండగా ఉండి మీకోసం పోరాడుతానని హామీ ఇచ్చారు.