పోడు భూముల ప్రస్తావనేది?

– కాంగ్రెస్‌ సభ్యుడు పోడెం వీరయ్య
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
గవర్నర్‌ ప్రసంగంలో పోడు భూముల ప్రస్తావన లేకపోవటం విచారకరమని కాంగ్రెస్‌ సభ్యుడు పోడెం వీరయ్య తెలిపారు. శనివారం అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ పోడు భూములకు హక్కు పత్రాలకోసం నాలుగు లక్షలకు పైగా దరఖాస్తులొచ్చాయని తెలిపారు. ఈ అంశాన్ని గవర్నర్‌ ప్రసంగంలో చేర్చకపోవటం సరికాదన్నారు. సీతరామ సాగర్‌ నిర్వాసితులకు తగిన నష్టపరిహారం ఇవ్వలేదని చెప్పారు. గిరిజన ప్రాంతాల్లో చాలా చోట్ల తాగు నీటి సౌకర్యం లేదన్నారు. వీటిని పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.