వేములవాడలో నూలు డిపో ఏర్పాటు

– ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
సిరిసిల్ల జిల్లా వేములవాడలో నూలు డిపో ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌ సిగల్‌ ఇచ్చింది. ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి శైలజ రామయ్యర్‌ శనివారం ఉత్తర్వులు (జీవో నెంబర్‌18) జారీ చేశారు. పవర్‌లూమ్‌ సెక్టార్‌ అవసరాల కోసం డిపో ఏర్పాటు చేస్తున్నట్టు ప్రభుత్వం తెలిపింది. నూలు డిపోకు తెలంగాణ స్టేట్‌ హాండ్లూమ్‌, వీవర్స్‌ కో ఆపరేటివ్‌ సొసైటీ లిమిటెడ్‌ (టీజీఎస్‌సీవో) నోడల్‌ ఏజెన్సీగా వ్యవహరించనుంది. నూలు సేకరణ, నిర్వహణ, అవసరమైన నిల్వలు ఉంచడానికి కార్పస్‌ ఫండ్‌ కింద రూ. 50 కోట్లు మంజూరు చేస్తున్నట్టు ప్రభుత్వం ఉత్తర్వులో పేర్కొంది.