నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
భువనగిరి పట్టణంలోని కొత్త వ్యవసాయ మార్కెట్ యార్డు కు సివిల్ సప్లయి కార్పొరేషన్ ద్వారా వచ్చే ప్రొక్రూట్మెంట్ బియ్యాన్ని యధావిధిగా మార్కెట్ యార్డ్ కు వచ్చే విధంగా మార్కెటింగ్ శాఖ అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి గోరేటి రాములు, ఎండీ ఇమ్రాన్ డిమాండ్ చేశారు. సోమవారం రోజున కొత్త వ్యవసాయ మార్కెట్ యార్డ్ హమాలీ కార్మికులకు జీవన ఉపాధి కల్పించాలని జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి జిల్లా కలెక్టర్ హనుమంత్ కె జెండగే కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రాములు ఇమ్రాన్ మాట్లాడుతూ గత 11 సంవత్సరాలుగా మార్కెట్ యార్డ్ లో బియ్యం దిగుమతి చేస్తున్నారని, పురుగుల సాకుతో బియ్యం రాకుండా చేసి కార్మికుల ఉపాధి దెబ్బతియొద్దని అన్నారు. పురుగులు రాకుండా ఎస్. డబ్ల్యూ. సి గోడౌన్ మేనేజర్ లికిత పూర్వకంగా హామీ ఇచ్చారని వారు తెలిపారు. కరోన నుండి మార్కెట్ యార్డ్ లో వడ్ల కొనుగోలు నిలిపివేశారని, ఇప్పుడు బియ్యం కూడా రాకుండా చేస్తున్నారని, మార్కెటింగ్ శాఖ అధికారులు తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని అయన డిమాండ్ చేశారు. భువనగిరిలో బీహార్ , ఇతర రాష్ట్రలకు చెందిన హమాలీలు అతి తక్కువ కూలికు ఇక్కడ పనిచేయడంతో స్థానిక హమాలీలకు ఉపాధి లేకుండా పోయిందని. వచ్చే పనిని మార్కెట్ శాఖ అధికారులు రాకుండా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది కేవలం ప్రైవేట్ గోడౌన్లకు లబ్ధి చేకూరే విధంగా భువనగిరి మార్కెటింగ్ శాఖ అధికారులు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. వెంటనే భువనగిరి కొత్త వ్యవసాయ మార్కెట్ యార్డులో బియ్యం దిగుమతి చేయుటకు మార్కెటింగ్ శాఖ అధికారులు ఆదేశాలు జారీ చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా సహాయ కార్యదర్శి గనబోయిన వెంకటేష్, జిల్లా కార్యవర్గ సభ్యులు సామల శోభన్ బాబు, హమాలీ సంఘo నాయకులు వల్దస్ నర్సింహా, నరాల రమేష్, గజ్జి ఐలయ్య, కుంకుంట్ల బొజ్జయ్య, అందె మల్లేష్, చంద్రయ్య, గొర్ల బాలనర్సింహా, కృష్ణ, జగన్, వెంకటేష్, లింగస్వామి, ధర్మయ్య లు పాల్గొన్నారు.