సుధీర్ బాబు తాజాగా ‘మా నాన్న సూపర్ హీరో’ సినిమాతో అలరించ బోతున్నారు. అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సిఏఎం ఎంటర్‌టైన్‌మెంట్‌తో కలిసి వి సెల్యులాయిడ్స్ బ్యానర్‌పై సునీల్ బలుసు నిర్మిస్తున్నారు. ఈనెల 11న విడుదల కానుంది.
ఈ సందర్భంగా హీరో సుధీర్ బాబు మీడియాతో ముచ్చటించారు.
– ఈ సినిమాలో కాన్‌ఫ్లిక్ట్ పాయింట్ బాగా సెట్ అయింది. ఇద్దరు తండ్రులు- ఒక కొడుకు చుట్టూ తిరిగే కథ ఇది. ముఖ్యంగా దీన్ని ఇద్దరు ఫాదర్స్, ఒక కొడుకు మధ్య నడిచే ట్రయాంగిల్ లవ్ స్టోరీ అని చెప్పొచ్చు. ఇది యూనివర్సల్ పాయింట్. తప్పకుండా అందరికీ కనెక్ట్ అవుతుందని నమ్ముతున్నాను.
– దర్శకుడు అభిలాష్ చేసిన ‘లూజర్’ సిరీస్ చూశాను. అభిలాష్ ఈ కథ చెప్పినప్పుడు చాలా ఫ్రెష్‌గా అనిపించింది. ఇది పర్‌ఫెక్ట్ ఫ్యామిలీ ఫిల్మ్. రేర్ స్టొరీ. డెఫినెట్‌గా ప్రేక్షకులకు నచ్చుతుంది. నా కెరీర్‌లో అత్యంత సంతృప్తికరమైన సినిమా ఇది. ఫస్ట్ డే నుంచే యునానిమస్‌గా ప్రేక్షకులు, క్రిటిక్స్ నుంచి పాజిటివ్ టాక్ వస్తుందనే నమ్మకం ఉంది.
– మహేష్‌కి మొదట రఫ్ కట్ పంపించాను. చూసి, లుకింగ్ గుడ్ అన్నారు. ఫైనల్ ట్రైలర్ పంపించిన తర్వాత.. చూసి చాలా అప్రిషియేట్ చేశారు. హార్ట్ టచ్చింగ్ అన్నారు.
– ప్రస్తుతం ‘జటాధరా’ చేస్తు న్నాను. కాన్సెప్ట్ పరంగా ఇది వెరీ బిగ్ స్కేల్ మూవీ. ప్రీ ప్రొడక్షన్ జరుగుతోంది. అలాగే రాహుల్ రవీంద్రన్‌తో ఓ సినిమా ఉంటుంది.