నిలువ నీడనిస్తే స్థలం కబ్జా చేసేయత్నం చేయడం సరికాదు

It is not appropriate to try to occupy the space if the stand gives shadeనవతెలంగాణ – మల్హర్ రావు
వలస కూలీలని నిలువ నిదనిస్తే ఇంటి స్థలాన్ని కబ్జా చేసే ప్రయత్నం చేయడం దారుణమని మండలంలోని రుద్రారం గ్రామానికి ఇంటి స్థలం యజమాని ఫణి రాజారావు ఆరోపించారు. మంగళవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు పదేళ్ల క్రితం జీవనోపాధి కోసం చిన్న పెళ్లి రాజేశ్వరి, రమాదేవి కుటుంబం   వచ్చిన క్రమంలో ఉండడానికి ఇల్లు లేదని రోడ్డు పక్కనే ఖాళీగా ఉన్న రామినేని నారాయణరావు స్థలంలో చిన్న కూరగాయలు, గాజుల కొట్టు పెట్టుకుంటామని ప్రాధేయపడగా మానవత్వంతో అవకాశం కల్పిస్తే ఇట్టి స్థలం మాదేనని దౌర్జన్యం చేయడం దుర్మార్గపు చర్యని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ.. గ్రామంలోని కొంతమంది పేదలు కూడా అదే స్థలంలో జీవనోపాధి కోసం చిన్న చిన్న దుకాణాలు పెట్టుకుని బ్రతుకుతున్నారు. నేడు ఆ భూమి యజమానులు కాళీ చేయమనగానే మిగతా వారంతా ఖాళీ చేశారు. కానీ పూసబెర్ల సాంబయ్య కుటుంబం మాత్రం ఖాళీ చేయడం లేదన్నారు. భూమి యజమానికి గిట్టని వారు కొంతమంది సాంబయ్య కుటుంబానికి అండగా ఉండి సమస్యను సృష్టించాలని తప్పుడు తోవపట్టిస్తున్నట్లుగా పేర్కొన్నారు. మానవత్వంతో చేరదీస్తే ఇంటినే కబ్జా చేసే ప్రయత్నం మంచిది కాదని, వారికి అండగా ఉండేవారు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకొని ముందుకు సాగాలని, ఇలాంటి సమస్యలను సృష్టిస్తే సమాజం చాలా ఇబ్బందులకు గురికాక తప్పదన్నారు. మానవత్వంతో పనిచేస్తున్న సామాజిక సంస్థలు సంఘాలు ఇట్టి విషయాన్ని పున పరిశీలన చేసుకొని ముందుకు సాగాలని హితవు పలికారు. నైతిక విలువలను కాపాడుకోవడంలో మనందరం ముందుండాలని తొందరపాటు చర్యలకు పాల్పడి అవమానాలకు గురికావద్దని గుర్తు చేశారు.ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రేణిగుంట్ల కొమురయ్య మాదిగ,జిల్లా ఉపాధ్యక్షులు,అంబాల రాజు మాదిగా, జిల్లా ఇన్చార్జి ఇంజపెల్లి ప్రవీణ్ మాదిగ,బీసీ నాయకులు వంగపల్లి రాజయ్య,మహిళా సంఘం నాయకులు రాదండి ఉమా , చింతల లత, చంద్రగిరి సంపత్, కంబాల శంకర్,కన్నూరి రమేష్ ,పేట మధునయ్య,గుర్రం మొండి,మంచినీళ్ల సమ్మయ్య,ఎల్లిపాయల రామయ్య,అంబటి చంద్రమోహన్ బడితల స్వామి,కంచర్ల రాజు.కన్నూరి పోశయ్య,ముత్తారం రామచందర్,నామండ్ల, లక్ష్మిరాజ్యం పాల్గొన్నారు.