వెక్కిళ్ళు మన శరీరంలో జరిగే ప్రక్రియ. శాస్త్రవేత్తల ప్రకారం, ఎక్కిళ్ళు నేరుగా శ్వాసకు సంబంధించినవి. మన జీర్ణక్రియ లేదా శ్వాసకోశ వ్యవస్థలో భంగం, అధిక కదలిక ఉంటే, వెక్కిళ్ళు మొదలవుతాయి. కడుపు, ఊపిరితిత్తుల మధ్య ఉన్న డయాఫ్రాగమ్, పక్కటెముకల కండరాల సంకోచం కారణంగా వెక్కిళ్ళు సంభవిస్తాయి.
ఈ వెక్కిళ్లు చిన్న హౌం రెమిడీస్ తోనే తగ్గిపోతాయి. అయితే ఎంతసేపైనా తగ్గవు, ఎన్ని నీళ్లు తాగినా ఆగవు. అలాంటప్పుడు కొన్ని హౌం రెమిడీస్తో ఎలా తగ్గించుకోవాలో తెలుసుకుందాం.
తేనె.. వేగస్ నాడి పారసింపథిటిక్ నాడి వ్యవస్థను నియంత్రిస్తుంది. వీటి విధుల్లో భాగం ఈ చర్యను నియంత్రించడం. తేనె వేగస్ నాడిని ఉపశమనం చేస్తుంది.
వెనిగర్.. సాధారణంగా మనం వెనిగర్‌ను వంటతోపాటు వెయిట్ తగ్గడానికి కూడా ఉపయోగిస్తాం. అయితే, దీంతో వెక్కిళ్లు కూడా ఆపవచ్చు ఇది డయాఫ్రాగమ్ అసంకల్పిత కదలికను రీసెట్ చేసి వెక్కిళ్లను నియంత్రిస్తుంది. దీని పుల్లని రుచి మనస్సును మళ్లించి తక్షణ ఉపశమనాన్ని అందిస్తుంది.
చక్కెర.. ఇది వేగస్ నాడిని మరింత ప్రేరేపిస్తుంది. నరాలను రీసెట్ చేసి, వెక్కిళ్ల నుంచి తక్షణమే ఉపశమనాన్ని అందిస్తుంది. స్వీట్లను టేస్టీగా మార్చే చక్కెరతో ఇకపై ఆగకుండా వస్తున్న వెక్కిళ్లను కూడా తగ్గించడానికి ఉపయోగించండి.