15న ప్రారంభం కానున్న Hyundai ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్

నవతెలంగాణ-హైదరాబాద్ : మోటర్ ఇండియా (కంపెనీ) తమ షేర్ల ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్‌ను 2024 అక్టోబర్ 15, మంగళవారం నాడు ప్రారంభించనుంది. యాంకర్ ఇన్వెస్టర్ బిడ్డింగ్ తేదీ దానికి ఒక పని రోజు ముందున, 2024 అక్టోబర్ 14 సోమవారం నాడు ఉంటుంది. బిడ్/ఆఫర్ ముగింపు తేదీ 2024 అక్టోబర్ 17, గురువారంగా ఉంటుంది. క్రిసిల్ నివేదిక ప్రకారం CY2023లో ప్యాసింజర్ వాహనాల అమ్మకాలపరంగా ప్రపంచంలోనే మూడో అతి పెద్ద ఓఈఎంగా ఉన్న Hyundai మోటర్ గ్రూప్‌లో Hyundai మోటర్ ఇండియా లిమిటెడ్ భాగంగా ఉంది. ఐపీవోకి సంబంధించి ఒక్కో షేరుకు ధర శ్రేణి రూ. 1,865 నుంచి రూ. 1,960 వరకు ఉంటుంది. కనీసం 7 ఈక్విటీ షేర్లకు, ఆ తర్వాత 7 ఈక్విటీ షేర్ల గుణిజాల్లో బిడ్లు దాఖలు చేయాల్సి ఉంటుంది. ఐపీవో కింద ఆఫర్ ఫర్ సేల్ విధానంలో 1,42,194,700 షేర్లను Hyundai మోటర్ కంపెనీ (“ప్రమోటర్ సెల్లింగ్ షేర్‌హోల్డర్”) విక్రయించనుంది. ఆఫర్ ద్వారా సమీకరించే నిధులేవీ (“ఆఫర్ ప్రొసీడ్స్”) కంపెనీకి లభించవు. కంపెనీ యొక్క షేర్లు బీఎస్ఈ లిమిటెడ్ (బీఎస్ఈ) మరియు నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎన్ఎస్ఈ) స్టాక్ ఎక్స్చేంజీల్లో లిస్ట్ చేయబడతాయి. కోటక్ మహీంద్రా క్యాపిటల్ కంపెనీ లిమిటెడ్, సిటీగ్రూప్ గ్లోబల్ మార్కెట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, హెచ్ఎస్‌బీసీ సెక్యూరిటీస్ అండ్ క్యాపిటల్ మార్కెట్స్ (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్, జేపీ మోర్గాన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మరియు మోర్గాన్ స్టాన్లీ ఇండియా కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలు ఈ ఆఫర్‌కు బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్లుగా వ్యవహరిస్తున్నాయి. మరింత సమాచారం కోసం hyundai.co.in లో లాగిన్ అవ్వండి.