నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ధాన్యం సేకరణకు సంబంధించిన పలు అంశాలపై అధ్యయనం చేసి సిఫారసులు చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించింది. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, తుమ్మల నాగేశ్వరరావుతో క్యాబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. పౌరసరఫరాలశాఖ కమిషనర్ డీఎస్ చౌహాన్ కమిటీకి కన్వీనర్‌గా ఉంటారు. గోదాముల లీజు, రైస్ మిల్లర్ల నుంచి బ్యాంకు గ్యారంటీలు, మిల్లింగ్ చార్జీలు, తదితర అంశాలపై మంత్రివర్గ ఉపసంఘం అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నది.